అంబేద్కర్ జయంతి 2022 - క్రియ పోటీలు


వ్యాసరచన, వక్తృత్వం, మాక్ పార్లమెంట్, క్విజ్ పోటీలు. ప్రభత్వ ప్రాధమికోన్నత / ఉన్నత పాఠశాలలకు మాత్రమే. తెలుగు మరియు ఇంగ్లీషు ఏ భాషలోనయినా వ్రాయవచ్చు, మాట్లాడవచ్చు. పోటీలను ఏప్రిల్ 13 న నిర్వహించి అదే రోజు వ్యాసరచన స్కాన్ కాపీలు, వక్తృత్వం వీడియోలు, మాక్ పార్లమెంట్, క్విజ్ పోటీల ఫొటోలను వాట్సాప్ ద్వారా 8332993993 నెంబరుకు పంపాలి. పోటీలకు ప్రవేశం ఉచితం. పోటీలన్నీ 6 నుంచి 10 తరగతి వరకు ఏ తరగతికి ఆ తరగతి విడివిడిగా నిర్వహించాలి. ప్రతి పోటీలో తరగతిలో అన్ని సెక్షన్లు కలిపి 20 మంది పైగా పాల్గొనేట్టు చూడాలి.

క్రింది లింక్ ద్వారా ఏప్రిల్ 11 నాటికి పాఠశాలలు రిజిస్టరు కావాలి.

https://forms.gle/DtmxLgHkKaSb4rF68

వ్యాసరచన: ప్రతి తరగతిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వ్యాసరచనల స్కాన్ కాపీలను 8332993993 నెంబరుకు వాట్సాప్ లో పంపాలి. వీరందరికీ పాఠశాల స్థాయి మెరిట్ సర్టిఫికెట్లు, జిల్లా స్థాయిలో ప్రతి తరగతి నుంచి కొందరికి జిల్లా స్థాయి మెరిట్ సర్టిఫికెట్లు పంపబడును.

వక్తృత్వం: ప్రతి తరగతిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వీడియోలను 8332993993 కు వాట్సాప్ లో పంపాలి. వీడియో రెండు నిముషాలకు మించకుండా ఉండాలి. ఎడిటింగ్ లేకుండా కంటిన్యూస్ వీడియో అయి ఉండాలి. వీరందరికీ పాఠశాల స్థాయి మెరిట్ సర్టిఫికెట్లు, జిల్లా స్థాయిలో ప్రతి తరగతి నుంచి కొందరికి జిల్లా స్థాయి మెరిట్ సర్టిఫికెట్లు పంపబడును.

మాక్ పార్లమెంట్: మాక్ పార్లమెంటు జరుగుతుండగా తీసిన ఒక ఫొటో ను 8332993993 కు వాట్సాప్ లో పంపాలి. ప్రతి తరగతి మాక్ పార్లమెంటు నుండి బాగా మాట్లాడిన ఇద్దరు విద్యార్థులకు పాఠశాల స్థాయి మెరిట్ సర్టిఫికెట్లు పంపబడును.

క్విజ్: ఒక్కో టీమ్ లో ఇద్దరు విద్యార్థులు ఉండేటట్లు క్విజ్ నిర్వహించాలి. క్విజ్ జరుగుతుండగా తీసిన ఒక ఫొటో ను 8332993993 కు వాట్సాప్ లో పంపాలి. వీరందరికీ పాఠశాల స్థాయి మెరిట్ సర్టిఫికెట్లు పంపబడును.

వ్యాస రచన, వక్తృత్వం పోటీలకు అంబేద్కర్, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం, పార్లమెంటు, లౌకికతత్వం, రాజ్యాంగంలోని పీఠిక, ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ఎన్నికలు, న్యాయ వ్యవస్థ, స్థానిక ప్రభుత్వాలు వంటి అంశాల్లో ఏవైనా తీసుకోవచ్చు. అన్ని తరగతులకు ఒకే అంశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఛాయిస్ కూడా ఇవ్వచ్చు. క్విజ్ లో ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, సైన్స్, మేథ్స్ ఏవైనా కావచ్చు. మాక్ పార్లమెంటుకు చర్చనీయాంశాలుగా మీ గ్రామ/పట్టణ సమస్యలు, అభివృద్ధి విషయాలను తీసుకోవచ్చు.

Download - అంబేద్కర్ జీవిత చరిత్ర

Download - భారత రాజ్యాంగం